శాంతి భద్రతలను కాపాడటంలో కూటమి ప్రభుత్వం రాజీ పడబోదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో స్పష్టంగా చెప్పారుపరామర్శలకు వచ్చి జగన్ రెడ్డి పథకాల గురించి చెప్తున్నాడు.2019 అధికారంలోకి వచ్చిన తరువాత చెప్పిన పథకాల్లో మొదటి సంవత్సరంలో ఏమి అమలు చేసాడో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి .సెక్యూరిటీ కావాలని న్యాయస్థానాలకు వెళుతున్న జగన్ రెడ్డి మానసిక స్థితి సరిగా లేదువచ్చే నెలలో ముఖ్యమంత్రి సీటుకూడా నాదేనని కోర్టుకు ఎక్కే పరిస్థితి ఏర్పడనుంది.మొదటి నెలలో ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి పాలన అన్నావ్.. ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుల్లో కేసులు వేశావు నీకు ఢిల్లీలో పత్రికలు, మీడియా గడ్డిపెట్టినా సిగ్గు రాలేదు.నువ్వు చేసిన విధ్వంసాన్ని ఆలపాటి సురేష్ గారు కళ్ళకు కట్టినట్లు రాసిన పుస్తకాన్ని నీకు పంపిస్తా.. ఈ రాష్ట్రాన్ని ఎంత విధ్వంసం చేసావో చాలా స్పష్టంగా ఉంది .రెండు మూడు నెలలు తిరగకుండానే మాజీ స్పీకర్ కోడెల గారిని పొట్టనపెట్టుకున్నావ్ .చంద్రబాబు గారు పల్నాడు వెళ్తుంటే ఇంటి గేటుకు తాళ్లు కట్టావు నువ్వా శ్రీరంగ నీతులు, బంగాళాఖాతం గురించి మాట్లాడేది 11 సీట్లు వచ్చినా నీలో పరివర్తన లేదు ప్రజలు ఇచ్చిన తీర్పుతో నిన్ను బంగాళాఖాతంలో కలిపారు.తోట చంద్రయ్య గొంతు కోసావు అయ్యన్న ఇంటి గోడ కూల్చారు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ నాయకులు ఇలా అందరిపై కేసులు పెట్టావు కౌన్సిలర్ రంగన్న ఇంటిని కాల్చేసారు.ఇంత విధ్వంసం చేసి నువ్వు పరామర్శకు వచ్చి సుద్దులు చెప్తావా?దళితుల 27 పథకాలు రద్దు చేసావు వాళ్ళపై కేసులు పెట్టి వాళ్ళ గురించి నీతులు మాట్లాడతావా.నీది అసమర్థ చేతగాని పరిపాలనా వైఫల్యంకొడాలి నాని, వల్లభనేని వంశీ, చంద్రశేఖర్ రెడ్డి వీళ్లు పశువుల కన్నా హీనంగా మహిళల పట్ల, కుటుంబ సభ్యుల పట్ల వెదవ కూతలు కూసారుకౌరవసభలో సుయోధనుడిలా వికటాట్టహాసం చేస్తే నిన్ను 11 సీట్లతో పరిమితం చేసారు.పాపాలన్నీ నిన్ను వెంటాడుతున్నాయి.. చంద్రబాబు గారిపై అక్రమ కేసులు పెట్టి వేధించావు. నీ సుభాషితాలు, శ్రీరంగ నీతులు బూతు మాటలు, బాష కట్టిపెట్టు.కూటమి ప్రభుత్వం ఎదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా ముందుకు తీసుకెళతాం