ఏపీ మంత్రివర్గ సమావేశం కీలక తీర్మానాలు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.అక్టోబర్ 1వ తేదీ నుంచి నూతన మద్యం విధానం అమలులోకి తీసుకురానున్నామని మంత్రి పొలుసు పార్థసారథి మీడియా సమావేశంలో వెల్లడించారు.అల్పదాయ వర్గాలకు నాణ్యమైన మద్యాన్ని అందుబాటులో ధరలకు అందించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు. 2019-24 కాలంలో వైఎస్ జగన్ అమలు చేసిన మద్యం పాలసీ వల్ల ఏపీకి 18,860 కోట్ల నష్టం జరిగిందని వెల్లడించారు.