ఆంధ్రప్రదేశ్‌లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. అందుకు అనుగుణంగా పలు సమస్యల పరిష్కార దిశగా పావులు కదుపుతోంది. ముఖ్యంగా ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని తెచ్చి ఆ సమస్య తీర్చింది. దీని వల్ల ప్రజలు సహా నిర్మాణ రంగ కార్మికులకు ఎంతో లబ్ధి చేకూరుతోంది. అలాగే అమరావతి రైతుల పోరాటాన్ని ప్రశంసిస్తూ వారికి తగిన న్యాయం చేస్తోంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి సమస్యలు విన్నవించేందుకు ప్రజలు భారీ ఎత్తున కూటమి ఎమ్మెల్యేలు, మంత్రుల వద్దకు క్యూ కడుతున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ప్రతి రోజూ వందల కొద్ది అర్జీలు వస్తున్నాయి.