కూడేరు మండలంలోని ఎంఎం హళ్లి గ్రామంలో ఓ వృద్ధురాలు విద్యుదాఘాతంతో మృతి చెందింది. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వృద్ధురాలు అక్కమ్మ (70) మంగళవారం ఉదయం దొడ్లో పశువులను కట్టేసేందుకు మనవడిని ఎత్తుకెళ్లింది. పశువులను కట్టేసి ఇంటికి వస్తుండగా మార్గంమధ్యలో విద్యుత స్తంభం స్టే వైరు తెగి కిందకు వేళాడుతోంది. గమనించని అక్కమ్మ ఆ వైరును తగిలింది. దీంతో కరెంట్ షాక్ కొట్టడంతో మనవడిని పక్కకు పడేసింది. ఆమె మాత్రం షాక్‌కు గురైంది. సమీపంలో ఉన్న కుటుంబ సభ్యులు వెళ్లి చూసే సరికి మృతి చెందింది. పోలీసులు, విద్యుత అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆమె కుమారుడు మహేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ వెంటనే ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కలెక్టర్‌ను, విద్యుత శాఖ ఎస్‌ఈను ఆదేశించారు. ప్రమాదంపై విచారణ జరపాలని తెలిపారు.