ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ క్యాబ్ డ్రైవర్‌లకు చిన్న రిక్వెస్ట్ చేశారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు తీరగానే.. ఏపీ క్యాబ్ డ్రైవర్లను తెలంగాణవారు నగరంలో అడ్డుకోవడం, సరికాదన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీస్‌లు పలువురు ఏపీకి చెందిన డ్రైవర్లు పవన్‌న కలిశారు. ఆల్ ఇండియా పర్మిట్‌తో తెలంగాణ తాత్కాలిక పర్మిట్ తీసుకుని క్యాబ్‌లు నడుపుతున్నామని.. తమను అక్కడి డ్రైవర్లు అడ్డుకుంటున్నారని పలువురు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. ఉమ్మడి రాజధాని గడువు పరిధి జూన్ 2తో అయిపోయిందంటూ ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య సఖ్యత ఉండాలన్నారు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని పనులు మొదలుకాగానే ఇక్కడి డ్రైవర్లకు ఉపాధి మెరుగవుతుంది అన్నారు. అప్పటి వరకు సాటి డ్రైవర్లకు మానవతా దృక్పథంతో సహకరించాలని కోరారు. ఈ సున్నితమైన అంశంలో దాదాపు రెండు వేల కుటుంబాల వేదన ఉందన్నారు డిప్యూటీ సీఎం. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి ఈ సమస్య పరిష్కారమయ్యేలా చొరవ తీసుకుంటామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
మరోవైపు విశాఖ జీవీఎంసీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లు, కొందరు మాజీ కార్పొరేటర్లు, మరికొందరు వైఎస్సార్‌సీపీ నేతలు జనసేన పార్టీలో చేరారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అధినేత పవన్ కళ్యాణ్ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. జనసేన పార్టీలో చేరిన వారిలో పుర్రె పూర్ణశ్రీ, కంటిపాము కామేశ్వరి, భట్టు సూర్యకుమారి, పెద్దిశెట్టి ఉషశ్రీ, ఆళ్ల లీలావతి.. ఆమె భర్త శ్రీనివాస్‌లు ఉన్నారు. విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాసయాదవ్ ఆధ్వర్యంలో వీరు పార్టీలో చేరారు. ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన పార్టీలోకి చేరికలు తనకు ఇష్టమైన విశాఖ నుంచి ప్రారంభమవడం ఆనందంగా ఉందన్నారు పవన్ కళ్యాణ్. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి తరఫున విజయం సాధించేలా కృషి చేయాలని సూచించారు. విశాఖ నగరంలో కాలుష్య సమస్య ఎక్కువగా ఉందని.. కార్పొరేటర్లందరిపై కాలుష్య నియంత్రణ బాధ్యత ఉందన్నారు డిప్యూటీ సీఎం. నగరంలో పొల్యూషన్ ఆడిట్ నిర్వహించాలన్నారు. విశాఖలో రియల్ ఎస్టేట్ సమ స్యలు ఎక్కువగా ఉన్నాయని, అన్నింటినీ పరిశీలించి న్యాయం చేస్తామన్నారు.