జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పట్టుదల ఈ రాష్ట్రానికి అవసరమని ప్రజలు ఎన్డీఏ కూటమిని గెలిపించారని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు అన్నారు. పార్టీ నాయకులను, పార్టీని అనుసంధానం చేస్తామని వివరించారు. తొలి ఐదు సంతకాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ప్రజలు, రైతులు, నిరుద్యోగులకు పార్డీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి అమరావతి, పోలవరం రెండు కళ్లు అని ఉద్ఘాటించారు. నదులను అను సంధానం చేస్తే ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వవచ్చని అన్నారు. కృష్ణా, గోదావరి జలాలను పోతిరెడ్డి పాడు ప్రాజెక్టులో ఎత్తి పోస్తే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. పేదరికాన్ని నిర్మూలించేందుకే చంద్రబాబు పీ4 ఫార్ములా తెస్తున్నారని చెప్పారు. అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తామని కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు.