వరకట్న వేధింపుల కేసులో నేరం రుజువుకావడంతో నలుగురికి జైలుశిక్ష విధిస్తూ టెక్కలి కోర్టు జూనియర్ న్యాయాధికారి ఎన్‌హెచ్‌ఎన్ తేజా చక్రవర్తి బుధవారం తీర్పు చెప్పిటనట్టు ఎస్‌ఐ మహ్మద్ ఆమీర్ ఆలీ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. సైలాడ పంచాయతీ దొడ్లరామచంద్రపురం గ్రామానికి చెందిన కర్రి అప్పారావు కుమార్తె హేమలతకు మందస మండలం లోహరిబంద గ్రామానికి చెందని నర్తు హేమరాజుతో వివాహమైంది. కొంతకాలం సజావుగా సాగిన వీరి కాపురంలో హేమరాజు, అతడి తల్లి కనకమ్మ, అన్నయ్య గోపాలరావు, వదిన సరోజని అదనపు కట్నం కోసం హేమలతకు చిత్రహింసలు పెట్టి ఇంటినుంచి గెంటివేశారు. ఈ నేపథ్యంలో 2018లో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిం ది. అప్పటి ఎస్‌ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయాధికారి బుధవారం తీర్పు చెప్పారు. నిందితులపై నేరం రుజువుకావడంతో హేమలత భర్త హేమరాజుకు 1 నెలలు జైలు, రూ.3 వేలు జరీమానా, అతడి తల్లి, వదినలకు మూడు నెలల జైలుతో పాటు రూ.1000 చొప్పున జరీమానా విధించారు. ఏపీపీ డి.హరిప్రియ బధితురాలి తరఫున వాదించారు.