గత వైసీపీ ప్రభుత్వం బిందు, తుంపర్ల సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వక పోవ డంతో ఆ పథకం అటకెక్కింది. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడంతో దాదాపు ఐదేళ్లుగా ఎదురు చూస్తున్న మెట్ట ప్రాంత రైతులలో మళ్లీ ఆశలు చిగు రించాయి. 2024–25 సంవత్సరానికి సూక్ష్మసేద్య పథ కాన్ని అమలు చేస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పటికే ప్రకటించారు. ఏలూరు జిల్లాలో సూక్ష్మ సేద్య పథకాన్ని 15వేల హెక్టార్లలో అమలు చేయాలని లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నారు. జిల్లా కు 2024–25 సంవత్సరానికి ఈ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ సూక్ష్యసేద్య పథకం జిల్లాలో 2003–04 నుంచి 2023–24 వరకు అమలు విస్తీర్ణం 1,08,684 హెక్టార్లు కాగా 86,786 మంది రైతులు లబ్ధి పొందారు. ఈ సూక్ష్మ సేద్య పథకాన్ని అమలు చేయడానికి అందుబాటులో ఉన్న విస్తీర్ణం 78 వేల 261 హెక్టార్లుగా ఉంది. ఈ పథకానికి సంబంధించి సన్న, చిన్నకారు రైతులకు (ఐదు ఎకరాల లోపు) 90 శాతం రాయితీ, పెద్దరైతులకు (ఐదు ఎకరాలు నుంచి 12.5 ఎకరాల లోపు రైతులకు) 50 శాతం రాయితీ అందించాలని నిర్ణయించారు. ఇక స్ర్పింకర్లు ఏర్పా టుకు సంబంధించి సన్న చిన్నకారు రైతులకు 55 శాతం రాయితీ , పెద్దరైతులకు 45 శాతం రాయితీ కల్పించాలని నిర్ణ యించారు. బిందు, తుపంర్ల సేద్యానికి ప్రభుత్వ రాయి తీ పొందాలంటే రైతులు తమ ఆధార్‌కార్డు, భూమి యాజమాన్య పత్రం, జత చేసి సంబంధిత మండల ఉద్యాన శాఖాధికారి/ గ్రామ ఉద్యాన సహాయకుడు/ గ్రామ వ్యవసాయ సహాయకుడు / గ్రామ సెరీకల్చర్ సహాయ కుడు/ సూక్ష్మ నీటి పారుదల ప్రాంత అధికారులతో గాని లేక సంబంధింత గ్రామ రైతు సేవా కేంద్రం (ఆర్‌ఎస్‌కే) లేదా జిల్లా మైక్రో ఇరిగేషన్ కార్యాలయం, ఏలూరు కార్యాలయంలో బయోమెట్రిక్ ద్వారా నమోదు ప్రక్రియ చేసుకోవచ్చు. అర్హులైన దర ఖాస్తుదారులు తోట/ పొలం, వారు ఎంపిక చేసుకున్న సూక్ష్మ సేద్య కంపెనీ ప్రతినిధులు, రైతు సేవా కేంద్ర సహాయకుల క్షేత్ర సందర్శన చేసి, సూక్ష్మ సేద్య డిజైన్ అంచనాలను తయారు చేసిన తర్వాత రైతు చెల్లించా ల్సిన వాటా వివరాలు వారి సెల్‌ఫోన్‌కు సందేశం వస్తుంది. ఆ మొత్తాన్ని పీడీ, ఏపీఎంఐపీ వారికి చెల్లిం చాలి. తర్వాత పరిశీలించి అనంతరం కలెక్టర్ పరి పాలనా ఆమోదం ఇస్తారు. ఆపై రైతులకు వారి తోట/ పొలంలో సూక్ష్మ సేద్య పరికరాలను సరఫరా చేసి సం బంధిత కంపెనీ సాంకేతిక నిపుణులు ద్వారా బిగిస్తారు.