వ్యవసాయం తరువాత అతిపెద్ద పరిశ్రమగా గుర్తించబడిన చేనేత పరిశ్రమను ఆదుకోవాలని ఏపీ చేనేత కార్మిక సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి కడుపు కన్నయ్య ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. శనివారపుపేటలోని వీవర్స్ కాలనీలో శనివారం జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న చేనేత కార్మిక వ్యతిరేక విధానాలవలన చేనేతపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు ఆర్ధిక ఇబ్బందులకు గురై దుర్బర జీవితాలు గడుపుతున్నారని అన్నారు. చేనేత నేస్తం పథకాన్ని రూ.26 వేల నుంచి రూ.36 వేలకు పెంచాలన్నారు. చేనేత పరిశ్రమపై జీఎస్టీని తక్షణమే రద్దు చేయాలన్నారు. జౌళి శాఖ నుంచి చేనేతను విడదీసి చేనేత పరిశ్రమను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో చేనేత కార్మికులు గుత్తి పోతురాజు, మాడా వెంకటేశ్వ రరావు, పిచ్చుక నాగేశ్వరరావు, బళ్ళ కోటేశ్వరమ్మ, మాడా నాగరాజు, బళ్ళ రవికుమార్, ముప్పన నాగేశ్వరరావు, నెల్లూరి మంగబాబు తదితరులు పాల్గొన్నారు.