శ్రీకాకుళం జిల్లా, సోంపేట మండలం, పలాసపురం గ్రామానికి చెందిన సంక శోభ(35) డెంగ్యూ జ్వరంతో గురువారం మృతి చెందినట్టు ఆ గ్రామానికి చెందిన బెందాళం బాబూరావు తదితరులు ఆరోపిస్తున్నారు. వారం రోజుల కిందట జ్వరంబారిన పడిన ఆమె చికిత్స తీసుకుంటుంది. అయితే గురువారం మళ్లీ తీవ్రజ్వరం రావడంతో సోంపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. ఈ క్రమంలో సాయంత్రానికి ఫిట్స్ రావడంతో ఆమె మృతిచెందింది. కాగా శోభకు మన్మఽథరావు, ఇద్దరు కుమారులు ఉన్నారు. దీనిపై వైద్యాధికారులను సంప్రదించగా ఇటీవల నిర్వహించిన రక్త పరీక్షల్లో డెంగ్యూ లక్షణాలు ఆమెలో కనిపించలేదని, హైపర్టెన్షతో బాధపడుతున్నట్టు గుర్తించామన్నారు.