పలాస-సుమ్మాదేవి రైల్వే స్టేషన్ల మధ్య గురువా రం మధ్యాహ్నం రైలు కింద పడి 50 సంవత్సరాలు వయసు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్టు రైల్వే ఎస్ఐ షరీఫ్ తెలిపారు. గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని, మృతుడు ఎవరనేది తెలియ రాలేదని చెప్పారు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వాసుపత్రికి పోస్టు మార్టం నిమిత్తం తరలించామని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్త చేస్తున్నామని చెప్పారు.