ఘంటసాల మండలంలో విద్యుత్ వినియోగదారుల గృహాలు, వాణిజ్య సముదాయాలు, ఆక్వా చెరువులపై విద్యుత్ శాఖ ఈఈ కృష్ణానాయక్ ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. విజిలెన్స్ ఈఈ కె.వెంకటేశ్వర్లు, సిబ్బంది 31 బృందాలుగా ఏర్పడి 1608 గృహ సర్వీసులు, 77 వాణిజ్య సముదాయాలు, 7 ఆక్వా సర్వీసులను తనిఖీ చేశారు. గురువారం ఘంటసాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులు వివరాలు వెల్లడించారు. అద నపు లోడు వినియోగిస్తున్న 285 సర్వీసులకు రూ.8,20,000 రుసుము విధించామని తెలిపారు. ఎక్కడైనా విద్యుత్ చౌర్యం జరిగితే 9440812362, 9440812363, 8331014951కు సమాచారం ఇవ్వాలని సూచించారు. తనిఖీల్లో చల్లపల్లి డీఈఈ పి. ఎస్.నాగేశ్వరరావు, ఉయ్యూరు డీఈఈ ఎం.రామకృష్ణ, అవనిగడ్డ డీఈఈ ఎన్.సుబ్ర హ్మణ్యేశ్వరరావు, ఘంటసాల ఏఈ పి.రవికుమార్, ఉయ్యూరు డివిజన్ పరిధిలోని ఏఈలు, జేఈలు, లైన్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.