మచిలీపట్నం, చిలకలపూడి పోలీసు స్టేషన్ పరిధిలో డబ్బును కాయిన్స్‌గా మార్చుకుని కాయిన్స్ వినియోగిస్తూ నిర్వ హిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు గురువారం మెరుపు దాడి చేశారు. డీఎస్పీ అబ్దుల్ సుభాన్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నారా యణపురానికి చెందిన రిటైర్డు ఆర్టీసీ ఉద్యోగి వెంకటేశ్వరరావు ఇంట్లో పేకాట నిర్వహిస్తున్నారని సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారన్నారు. ఈ దాడిలో 11 మందిని అరెస్టు చేశామని, వారి నుంచి రూ.47,500 నగదు, 9 బైక్‌లు, 11 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. డబ్బును కాయిన్స్ రూపంలో మార్చి పేకాట ఆడుతున్నారన్నారు. ఇలా ఈ పేకాటలో దొరికిన కాయిన్స్ విలువ రూ.5 లక్షలకు సమానమన్నారు. రెండు నెలలుగా కాయిన్స్ రూపంలో రాత్రీపగలు తేడా లేకుండా ఆడుతున్నారని, ఇంటిని క్లబ్‌లాగా మార్చేశారని డీఎస్పీ తెలిపారు. దాడిలో ఆర్‌పేట సీఐ సోమేశ్వరరావు, చిలకలపూడి సీఐ సతీష్‌కుమార్, ఎస్‌ఐలు పాల్గొన్నారు.