కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీసు అధికారుల బదిలీలు చేపట్టారు. గురువారం మలివిడత బదిలీల పర్వంలో రాష్ట్రంలో 28మంది డీఎస్పీలకు స్థానచలనం కల్పించారు. ఒంగోలు డీఎస్పీగా ప్రస్తుతం శ్రీకాకుళంలో దిశ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న రాయిపాటి శ్రీనివాసరావుకు పోస్టింగ్ ఇచ్చారు. అదే విధంగా ఒంగోలు మహిళా పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న సీహెచ్.శ్రీనివాసరావును గన్నవరం డీఎస్పీగా నియమించారు. అదేవిధంగా గుంటూరు రేంజిలో 30మంది సీఐలను బదిలీ చేయగా జిల్లాలో ఐదుగురికి పోస్టింగ్ ఇచ్చారు. ఒంగోలు పీటీసీలో ఉన్న వై.రామారావును దర్శి సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా, పల్నాడు జిల్లా మాచర్ల రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న కె.సురే్‌షను గిద్దలూరు సీఐగా నియమించారు. ప్రస్తుతం కంభం సీఐగా పనిచేస్తున్న జె.రామకోటయ్యను గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బదిలీ చేశారు. బాపట్ల జిల్లా చీరాల 2 టౌన్ సీఐగా పనిచేస్తున్న జి.సోమశేఖర్ ను కొడపి సీఐగా, రేంజీ వీఆర్‌లో ఉన్న ఎన్.శ్రీకాంత్‌ను ఒంగోలు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బదిలీ చేశారు. గిద్దలూరు సీఐగా పనిచేస్తున్న దాసరి ప్రసాద్‌ను గురజాల టౌన్‌కు, ఒంగోలు డీటీసీలో పనిచేస్తున్న మాకినేని శ్రీనివాసరావును అమరావతి టౌన్‌కు బదిలీ చేశారు. అలాగే రేంజ్ వీఆర్‌లో ఉన్న మాకినేని మురళీకృష్ణను తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బదిలీ చేశారు. పీసీఆర్‌లో పనిచేస్తున్న కె.వెంకటేశ్వరరావును కందుకూరు సర్కిల్‌కు బదిలీచేయగా వై.వీరాస్వామయ్యను గిద్దలూరు టౌన్ నుంచి ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ సీఐగా బదిలీ చేశారు.