ఒంగోలు నగరంలో జరిగిన నకిలీ స్టాంపుల కుంభకోణంపై సమగ్ర విచారణ చేసి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఒంగోలు నియోజక వర్గ ఇన్‌చార్జి వైసీ.యోగయ్యయాదవ్ కోరారు. గురువారం ఒంగోలులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ను కలిసి నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా యోగయ్యయాదవ్ మాట్లాడుతూ.... ఒంగోలు-కొత్త పట్నం మధ్యలో ఉన్న బకింగ్‌హామ్ కాలువపై బ్రిడ్జిని పూర్తిచేయడంతో పాటు గుండ్లకమ్మ ప్రా జెక్టు గేట్ల మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా చర్యలు తీసకోవాలని కోరారు. మై నింగ్ జోన్‌లో ఉందని తెలిసినా కూడా గత వైసీపీ ప్రభుత్వం యరజర్ల కొండను ధ్వంసం చేసిందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభు త్వం కక్ష సాధింపుచర్యల్లో భాగంగా అర్హులైన అ నేక మంది పింఛన్లు తొలగించారని, వారందరికి తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, కూటమి ప్ర భుత్వం అమలు చేసే కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఆయా అంశా ల వారీగా సమస్యలను పరిష్కరించే విధంగా చ ర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని యోగయ్యయాదవ్ తెలిపారు.