ఒంగోలులో విమానశ్రయం ఏర్పాటు చేయాలని గురువారం పార్లమెంట్లో జరిగిన చర్చలో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .... గత పదేళ్లలో విమనాశ్రయాల సంఖ్య దేశంలో 150కు చేరుకున్నాయన్నారు. దేశంలో 75శాతం ప్రయాణికులు మూడు కంపెనీల విమానాల్లోనే ప్రయాణిస్తున్నారని చెప్పారు. విమానయాన టిక్కెట్ ధరలు తగ్గడంతో పేద, మధ్యతరగతి ప్రజలు సైతం విమానాల్లో ప్రయాణాలు చేస్తున్నారని తెలిపారు. 20 ఏళ్లక్రితం ఒంగోలులో విమానశ్రయం ఏర్పాటుకు 650 ఎకరాలను సంబంధిత బృందం పరిశీలించిందని, దీనిపై ఆనాడే సంబంధిత శాఖ అధికారులు సైతం ఆమోదించినట్లు గుర్తుచేశారు. కేంద్రం 60 శాతం నిధులి స్తే రాష్ట్రం 40శాతం నిధులతో నూతన విమానశ్రయాల ఏర్పాటుకు ముందుకు వెళ్లే అవకాశం ఉందని మాగుంట పేర్కొన్నారు.