ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీసులపై విరుచుకుపడ్డ నకిలీ విలేఖరి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 09, 2024, 11:16 PM

రోడ్డుపై ట్రాఫిక్‌ సమస్యకు కారణమవుతున్న కారును పక్కన పెట్టమన్నందుకు ఓ నకిలీ విలేకరి కానిస్టేబుల్‌పై రెచ్చిపోయి చివరకు అడ్డంగా దొరికిపోయాడు. శ్రీకాళహస్తి వన్‌టౌన్‌ సీఐ నరసింహారావు కథనం మేరకు.... ఏర్పేడు మండలం కొత్తకండ్రిగ గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనే యువకుడు కారులో గురువారం శ్రీకాళహస్తికి వచ్చాడు. ఆర్టీసీ కూడలి సమీపంలో రోడ్డు పక్కన కారు నిలిపి ఉంచడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ చెంచయ్య కారును పక్కకు తీయాలని నాగేశ్వరరావుకు చెప్పగా వాగ్వాదానికి దిగాడు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి విలేకరినంటూ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో కారును స్టేషన్‌కు తరలించారు.నాగేశ్వరరావు వద్ద ఉన్న అక్రిడిటేషన్‌ కార్డును సీఐ నరసింహారావు పరిశీలించగా అది నకిలీదని తేలింది.పోలీసు విధులకు ఆటంకం కలిగించడం,నకిలీ గుర్తింపుకార్డుతో విలేకరిగా చలామణి కావడంపై కేసు నమోదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com