విజయవాడలో డా. బిఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరుతో ఉన్న శిలాఫలకాన్ని ధ్వంసం చేయటాన్ని ఖండిస్తూ వైసీపీ నాయకులు గుంటూరు లాడ్జి సెంటర్ లో శుక్రవారం నిరసన తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు తూర్పు సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా తదితరులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, పాలాభిషేకం చేశారు.