తెనాలిలో ఓ ఇన్స్పెక్టర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఎస్ఐ వెంకటాద్రి వివరాల మేరకు.. తెనాలి రైల్వేస్టేషన్‌లోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)లో హెడ్ కానిస్టేబుల్‌గా ఓ మహిళ పని చేస్తున్నారు. తనతో ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ ఖలీల్ అసభ్యంగా మాట్లాడటమే కాకుండా.. జులై 19న తనను పట్టుకుని రూమ్‌కు రావాలని వేధించినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.