ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఆగస్టు 15న వేడుకలకు ఇప్పటివరకూ మైనర్ పంచాయతీలకు రూ.100, మేజర్ పంచాయతీలకు రూ.250 ఇస్తున్నారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.10 వేలు, రూ.25 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏపీ చరిత్రలోనే ఇదే మొదటిసారి.