కొలిమిగుండ్ల మండలంలోని గ్రామాల్లో 30. 8 మి. మీ వర్షపాతం నమోదైనట్లు ఏఎస్ఓ బాస్కరరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత నెల రోజులుగా వాన లేకపోవడంతో మండలంలోని గ్రామాల్లో పంటలు సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో కొలిమిగుండ్ల మండలంలోని కురిసిన చిన్నపాటి వర్షం సాగు చేసిన పంటలకు కొంతైనా ఊరటనిచ్చింది.