అంబేడ్కర్ సృతివనంపై దాడి చేయడమంటే దేశ ప్రజలను అవమానించటమేనని పల్నాడు జిల్లా నరసరావుపేటలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిశోర్, పార్టీ ఎస్సీ నేతలతో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ప్రజాస్వామ్యవాదులు ఈ ఘటనను ఖండించాలని పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. గుంటూరులో అంబేడ్కర్ విగ్రహాం ఎదుట మాజీమంత్రి అంబటి రాంబాబు, పార్టీ ఇతర నేతలు నిరసన వ్యక్తంచేసి అంబేడ్కర్ విగ్రహాన్ని పాలతో శుద్ధిచేశారు. తెనాలి, తాడికొండ, తుళ్లూరు, పొన్నూరులోనూ అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు.