మేము దేవుడిగా చూసుకునే అంబేడ్కర్ విగ్రహంపై దాడి చేసి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోం అని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు నత్తా యోనారాజు తెలిపారు. అయన మాట్లాడుతూ.... గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో పశి్చమగోదావరి జిల్లా గరగపర్రులో అంబేడ్కర్ విగ్రహం పెట్టనీయకుండా అడ్డుకున్నారు. అక్కడ విగ్రహం పెట్టాలని తలపెట్టిన వ్యక్తిని కూడా చంపించారు. అండగా నిలిచిన కుల సంఘాల ప్రతినిధులను అరెస్టు చేయించారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక విజయవాడలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి మా ఆత్మగౌరవం నిలబెట్టారు. అది చూసి చంద్రబాబు ఓర్వలేక ఇప్పుడు దాడి చేయించారు అని తెలిపారు.