తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఏటీజీహెచ్ అతిథి గృహం వరకు భక్తులు లైన్ లో వేచి ఉన్నారు. శనివారం 79, 313 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 39, 344 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం శనివారం రూ. 3. 65కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.