చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం లోని 6 మండలాలలో కురుస్తున్న అకాల వర్షాలకు పంట పొలాల్లో నీరు నిలిచిపోయింది. దీనితో వేరుశనగ పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం వారు మాట్లాడుతూ పంట చేతికి అంది వచ్చే సమయంలో ఈ అకాల వర్షాలు తమను నట్టేట ముంచుతున్నాయని తెలిపారు. సంబంధిత అధికారులు తమని ఆదుకోవాలని వాపోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa