జమ్మలమడుగులో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఆదివారం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో ఎస్సై కల్పన వాహనాలను తనిఖీలు చేసి, రికార్డులను పరిశీలించారు. వాహన పత్రాలు లేని వాహనదారులకు జరిమానాలు విధించారు. సీఐ మాట్లాడుతూ. వాహనదారులు తప్పనిసరిగా వాహనాల ధ్రువపత్రాలను దగ్గర ఉంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు.