ఒంటిమిట్ట చెరువు పంపింగ్ స్కీం శ్రీరామ్ ఎత్తిపోతల పథకం మరమ్మత్తు పనులను వెంటనే ప్రారంభించాలని రాజంపేట పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు చమ్మర్థి జగన్మోహన్ రాజు శనివారం కడప జిల్లా కలెక్టర్ వారికి ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఆయన వెంటనే స్పందించి సోమవారం నుండి మరమ్మత్తు పనులు చేపట్టాలని ఈఈ ని ఆదేశించారు. సోమవారం నుండి పనులు ప్రారంభం కానున్నాయని వారు తెలిపారు.