తమ ఈ-మెయిళ్లు హ్యాదయ్యాయని రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రచార బృందం వెల్లడించింది. ఇది ఇరాన్ మద్దతున్న బృందాల పనేనని ఆరోపించింది. అమెరికా ఎన్నికలు, ముఖ్యంగా ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ సైబర్ దాడులకు పాల్పడుతోందని ఇప్పటికే టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ ఆరోపించింది. ఇది జరిగిన ఒక్క రోజు వ్యవధిలోనే ట్రంప్ ప్రచార బృందం నుంచి ఈ ప్రకటన రావడం చర్చనీయాంశమైంది.