మునగపాక మండల పరిషత్తులో వైకాపాకు గట్టి షాక్ తగిలింది. ఎంపీపీ మల్ల జయలక్ష్మి, వైస్ ఎంపీపీ బొజ్జలక్ష్మి వైకాపాను వీడి జనసేన పార్టీలో చేరారు.ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ సమక్షంలో వీరంతా మంగళగిరి జన సేన కార్యాలయంలో ఆదివారం ఆ పార్టీ తీర్థంపుచ్చుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కన్నబాబు దాచుకోవడం, దోచుకోవడం తప్ప కనీసం కార్యకర్తలను పట్టించుకున్న పాపానలేదున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.