పలాస, కాశీబుగ్గ, మొగిలిపాడు, ఇండస్ట్రియల్ ఎస్టేట్ పరిధిలో ఉన్న జీడి పరిశ్రమలు, రైస్ మిల్లర్స్ కార్మికులతో కూడిన కాష్యూ రైస్ మిల్లర్ లేబర్ యూనియన్ ప్రత్యేక సమావేశం ఆదివారం 10 గంటలకు నిర్వహించారు. నూతన అధ్యక్షులుగా అంబటి క్రిష్ణమూర్తి, కార్యదర్శి సానా ఈశ్వరరావు, కోశాధికారిగా కోనారి రాములను ఎన్నుకొన్నారు. రెండేళ్ళకు ఒక్కసారి జరిగే నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.