అమరావతి రాజధాని అభివృద్ధికి పెనుగంచిప్రోలుకు చెందిన తిరుపతమ్మ దేవస్థానం మాజీ చైర్మన్, టీడీపీ నాయకుడు కాకాని శ్రీని వాసరావు కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాకాని భరత్‌కుమార్ రూ.లక్ష విరాళాన్ని ఆదివారం ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్(తాతయ్య)కు అందజేశారు. భరత్‌ను తాతయ్య ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు కొల్లా రఘు రామయ్య, రిటైర్డ్ ఎఫ్‌సీఐ అధికారి కొల్లా వెంకటేశ్వరరావు, మునుగచర్ల మాజీ సర్పంచ్ నల్లజాల సత్యనారాయణ, లగడపాటి ప్రవీణ్, వనమా కృష్ణార్జునరావు, నల్లూరి అప్పారావు, గింజుపల్లి రహణ పాల్గొన్నారు.