రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో పోర్టు కార్మికులు, ట్రాన్స్ పోర్టర్లు, ఎగుమతిదారుల ప్రతినిధులతో సమావేశం లో పి.డి.ఎస్. బియ్యం అక్రమ రవాణాకు ప్రభుత్వ కఠిన చర్యలను స్వాగతిస్తున్నామని, కొత్తగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టు మూలంగా ఎగుమతి ప్రక్రియ ఆలస్యం అవుతుందనీ తెలిపిన పోర్టు కార్మికులు, ట్రాన్స్ పోర్టర్లు, ఎగుమతిదారుల ప్రతినిధులు. ఇందుకు స్పందించిన శ్రీ నాదెండ్ల మనోహర్ గారు. మరో రెండు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి జాప్యం నివారిస్తామని ప్రకటించారు. చెక్ పోస్టుల్లో 3 షిఫ్టుల్లో పని చేసేలా అదనపు సిబ్బందిని నియమిస్తామని శ్రీ మనోహర్ గారు వెల్లడి.ఇప్పటికే దాడులు చేసి పౌర సరఫరాల శాఖ 6ఏ కేసులు నమోదు చేసింది. క్రిమినల్ కేసులు కూడా దాఖలు చేసి నోటీసులు ఇచ్చే ప్రక్రియ మొదలైంది. పేదలకు బియ్యం ఇస్తున్నాము. ఒక కేజీ బియ్యానికి రూ.43.50పై. ప్రభుత్వం వెచ్చిస్తోంది. ఆ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాళ్లపై కచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము.