చిట్వేలి మండలం కె. కందులవారి పల్లికి చెందిన తుంగా జయచంద్ర నాయుడు కుమారుడు తుంగా రామకృష్ణ నాయుడు చిట్వేలి మండలంలో నూతనంగా నిర్మిస్తున్న బ్రహ్మంగారి మఠం నిర్మాణమునకు మంగళవారం 10, 516 రూపాయలు విరాళం అందజేశారు. వారికి, వారి కుటుంబ సభ్యులందరికి వీరబ్రహ్మేంద్ర స్వామి దీవెనలు ఉండాలని కోరుకుంటున్నామని ఆలయ ధర్మకర్త కట్టా రామమోహన్ నాయుడు తెలిపారు.