కర్నూలు జిల్లా, బేతంచెర్ల పట్టణంలోని హనుమాననగర్కు చెందిన బోయ ముచ్చు రవి(24) అనే యువకుడు కడుపు నొప్పి తాళలేక మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బోయ రాముడు సుభద్ర మ్మ దంపతుల రెండో కుమారుడు రవి. మతిస్థిమితం లేకుండా ఉండటంతో కడుపునొప్పితో బాధపడుతూ ఉండేవాడని తెలిపారు. ఇంట్లో ఎవరూలేని సమయంలో రవి ఉరివేసుకున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు.