కర్ణాటకలో రామనగర జిల్లా మాగడిలో దారుణం జరిగింది. భార్య అందంగా ఉండటం.. బాగా బాగా తయారై బయటకు వెళ్లడాన్ని సహించలేని భర్త.. ఆమెను హత్య చేశాడు. ఉమేశ్ (35) భార్య దివ్య (32) అందంగా కనపడాలనే తపనతో లిప్స్టిక్ వేసుకునేది. భుజంపై ఓ టాటూ కూడా వేయించుకుంది. ఈ పద్దతులు నచ్చని ఉమేశ్ ఆమెతో గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో స్నేహితులతో కలిసి హత్య చేశాడు.