పేదలకు మూడు పూటలా నాణ్యమైన భోజనం పెట్టి వారి ఆకలిని తీర్చేందుకు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామని, పలాసలో శుక్రవారం ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. అన్న క్యాంటీన్‌ను అధికారులు, టీడీపీ నేతలతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో కమిషనర్ టి నాగేంద్రకుమార్, టీడీపీ నేతలు వజ్జ బాబూరావు, పి.విఠల్ రావు, గాలి కృష్ణారావు, సూర్యనారాయణ, డొక్కరి శంకర్, రవి శంకర్ గుప్తా, డీఈ కనకరాజు, ఏఈ అవినాష్ తదితరులు పాల్గొన్నారు.