వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భూ అక్రమాలు జరిగినట్లు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. విశాఖలో మాత్రమే భూ అక్రమాలు జరిగాయని అనుకుంటే పొరపాటే అన్నారు. ఆగస్టు 15సందర్భంగా విశాఖ గ్రీన్ పార్క్ కూడలి వద్ద సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన భూ దందాలపై విచారణ జరిపిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. 200సంవత్సరాలలో బ్రిటిష్ వారు ఎంత దోచుకున్నారో గడిచిన ఐదేళ్ల పాలనలో వైసీపీ నాయకులు అంతలా దోచుకున్నారంటూ అనగాని తీవ్ర విమర్శలు గుప్పించారు. నూతన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు.