రాజమహేంద్రవరం 31వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కంపిటేషన్స్ లో ముఖ్య అతిధి గా పాల్గొన్న టీడీపీ రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి dr.గోరంట్ల రవిరామ్ కిరణ్ జ్యోతి ప్రజ్వలన చేసి కంపిటేషన్స్ ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమం లో కిక్ బాక్సింగ్ జాతీయ అధ్యక్షులు సంతోష్ k.అగర్వాల్, రాష్ట్ర అధ్యక్షులు జి.ఆనంద్ బాలు రాష్ట్ర కార్యదర్శి పి.ఆనంద్ ఆచార్య రాజమండ్రి కిక్ బాక్సింగ్ ఛైర్మెన్ రొంపిచర్ల ఆంటోనీ దాస్ ఆధ్వర్యంలో రవిరామ్ కిరణ్ గారికి శాలువాతో సత్కరించి జ్ఞపికను అందజేశారు.ఈ సందర్బంగా గోరంట్ల రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ ఈరోజు రాజమండ్రి s.k.v.t పాఠశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కంపిటేషన్స్, రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది క్రీడా కారులు విచ్చేసి ఈ కంపిటేషన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అలాగే కంపిటేషన్ నిర్వాహస్తున్నటువంటి 17 వ వార్డ్ టీడీపీ ఇంచార్జి రొంపిచర్ల ఆంటోనీ దాస్, మరియు కిక్ బాక్సింగ్ అసోసియేషన్ కి అయన శుభాకాంక్షలు తెలుపుతూ ఇటీవంటి క్రీడలు ఎంతో మంది యువతి యువకులకు స్ఫూర్తిగా తీసుకుని యువత అనేక క్రీడాల్లో పాల్గొని బావితరాలకు రాష్టానికి, దేశానికీ ఆదర్శంగా నిలవాలని కోరారు ఇప్పటివరకు కిక్ బాక్సింగ్ సరైన స్థలం లేకపోవడం చాలా బాధకారం అని అన్నారు త్వరలోనే రాజమహేంద్రవరం రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి దృష్టికి తీసుకువెళ్లి కిక్ బాక్సింగ్ కోర్ట్ కి స్థలం ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేస్తామని గోరంట్ల రవిరామ్ కిరణ్ తెలియజేసారుఈ కార్యక్రమంలో 28 వ వార్డ్ ఇంచార్జి శీలం గోవింద్,చీఫ్ ఆర్గనైజర్ m. గణేష్, ఆర్గనైజర్ N. గిరి వెంకట రమణ,స్టేట్ కోచ్ m. భవాని శంకర్, మరియు రొంపిచర్ల ఆంటోనీ దాస్ వారి మిత్ర బృందానికి అభినందనలు తెలియజేసారు.