తెలుగు రాష్ట్రాల మధ్య మొత్తం ఎనిమిది ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. 07175 నంబరుతో ఆగస్టు 18న నర్సాపూర్‌లో సాయంత్రం ఆరింటికి బయల్దేరనున్న ప్రత్యేక రైలు.. మరుసటి రోజు అంటే ఆగస్ట్ 19వ తేదీ ఉదయం ఐదింటికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. అలాగే 07176 నంబరుతో ఆగస్ట్ 19న సాయంత్రం ఆరు గంటల 20 నిమిషాలకు బయల్దేరనున్న ప్రత్యేక రైలు.. ఆగస్ట్ 20వ తేదీ ఉదయం ఐదింటికి నర్సాపూర్ చేరుకుంటుందని రైల్వే శాఖ ప్రకటనలో తెలిపింది. ఇక కాకినాడ- సికింద్రాబాద్ మార్గంలో 07177 నంబరుతో ఆగస్ట్ 17, ఆగస్ట్ 19వ తేదీల్లో ప్రత్యేక రైలు నడవనుంది. కాకినాడలో రాత్రి 9 గంటలకు బయల్దేరనున్న రైలు.. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది
అలాగే 07178 నంబరుతో సికింద్రాబాద్- కాకినాడ మధ్య కూడా ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. ఆగస్ట్ 18, 20వ తేదీల్లో సాయంత్రం ఆరు గంటల 20 నిమిషాలకు సికింద్రాబాద్‌లో బయల్దేరనున్న ఈ రైలు.. మరుసిట రోజు ఉదయం ఆరున్నరకు కాకినాడ చేరుకుంటుంది. మరోవైపు కాచిగూడ- తిరుపతి మార్గంలోనూ ప్రత్యేక రైలు నడుపుతున్నారు. 07455 నంబరుతో ఆగస్ట్ 16వ తేదీ రాత్రి పదిన్నరకు కాచిగూడలో బయల్దేరనున్న ప్రత్యేక రైలు.. మరుసటి రోజు ఉదయం పదిన్నరకు తిరుపతి చేరుకుంటుంది. ఇక అదేరోజు 07456 నంబరుతో తిరుపతిలో రాత్రి 7 గంటల 50 నిమిషాలకు బయల్దేరి ఆగస్ట్ 18 ఉదయం 9 గంటల 30 నిమిషాలకు కాచిగూడ చేరుకుంటుంది.
మరోవైపు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాకినాడ సికింద్రాబాద్ మధ్యన అదనంగా మరో ప్రత్యేక రైలు నడుపుతున్నారు. ఈ రైలు ఆగస్టు 18 సాయంత్రం ఆరున్నరకు కాకినాడలో బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం ఆరుగంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అలాగే ఆగస్ట్ 19వ తేదీ రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాలను గుర్తుంచకుని తమ ప్రయాణాలను షెడ్యూల్ చేసుకోవాలని సూచించారు.