మీరు జీర్ణ సమస్యలతో బాధపడుతున్నట్లయితే, తప్పనిసరిగా సోంపు గింజల నీటిని తీసుకోవడం ప్రారంభించాలి. ఎందుకంటే.. జీర్ణరసాలు, ఎంజైమ్ల ఉత్పత్తిని ప్రేరేపించే అనెథోలు సోంపు గింజలు కలిగి ఉంటాయి. ఉదయాన్నే సోంపు గింజలు కలిపిన నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని నిపుణులు తెలిపారు. ఫ్లేవనాయిడ్లు, విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు సోంపులో ఉంటాయి. దాని నీరు శరీరం నుంచి మలినాలను తొలగించడంలో దోహదపడతాయి.