కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంపెనీలను రప్పించేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏపీని వీడిన, మధ్యలోనే పనులు నిలిచిపోయిన కంపెనీలపై ప్రధానంగా దృష్టించింది. అందులో భాగంగా అశోక్ లేలైలాండ్ పున:ప్రారంభం. మల్లవల్లి పారిశ్రామిక పార్కులో అశోక్ లేలాండ్ పునఃప్రారంభం కానుంది. అశోక్ లేలాండ్‌ను మంత్రి నారా లోకేష్ సెప్టెంబర్ 17 వ తేదిన ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అశోక్ లేలాండ్ ప్రతినిధులతో గన్నవరం ఎంఎల్ఏ యార్లగడ్డ వెంకట రావు పలుమార్లు చర్చలు జరిపారు. 75 ఎకరాల్లో 130 కోట్లు రూపాయలతో బాడీ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటుకానుంది. దేశంలో మొదటి సారిగా మల్లవల్లి పారిశ్రామిక వాడలో బస్ బాడీ బిల్డింగ్ యూనిట్‌ను అశోక్ లేలాండ్ ఏర్పాటు చేసింది.