ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఉద్యోగుల బదిలీలు.. మార్గదర్శకాలు జారీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 17, 2024, 07:02 PM

ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు బదిలీలు చేపట్టగా , తాజాగా ఉద్యోగుల బదిలీల  పై దృష్టిని సారించింది. మొత్తం 12 శాఖల్లో ఈనెల 19 నుంచి నెలాఖరు వరకు బదిలీలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసింది.ప్రజా సంబంధిత సేవల్లో ఉండే శాఖల్లో మాత్రమే బదిలీలకు అనుమతించినట్లు ప్రభుత్వం పేర్కొంది. రెవెన్యూ  , పంచాయతీరాజ్, గనులు, పౌర సరఫరాలు, అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఇంజినీరింగ్‌, దేవాదాయ , స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, అటవీ, రవాణా, పురపాలక, గ్రామ వార్డు సచివాలయాలు, పరిశ్రమలు, విద్యుత్‌, వాణిజ్చ పన్నులు శాఖలోని ఉద్యోగుల బదిలీలకు అనుమతి ఇచ్చింది. ఎక్సైజ్‌ శాఖలో బదిలీలకు సెప్టెంబర్‌ 5 నుంచి 15 వరకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa