ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో దారుణం జరిగింది. ఆగస్టు 12న అర్ధరాత్రి దాటిన తర్వాత 15 ఏళ్ల బాలికపై కదులుతున్న బస్సులో సామూహిక అత్యాచారం జరిగింది. పంజాబ్‌కు చెందిన బాలిక ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు బయల్దేరింది. బస్సు డ్రైవర్, కండక్టర్‌తో సహా ఐదుగురు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) అధికారులు బాధిత బాలికను సంరక్షణా కేంద్రానికి తరలించారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.