రాజధాని ప్రాంతంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఉండాలని ప్రజల కోరిక.. కానీ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో ఎటువంటి పనులు చేపించకుండా మూలన పడేసింది... కాంట్రాక్టర్ తో ఉన్న లీగల్ ఇష్యూస్ ని రెండు మూడు నెలల్లో సెటిల్ చేసుకొని త్వరలో పనులు ప్రారంభిస్తాం... ఈ స్టేడియంలో ఏడాదిలోపు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లు జరిగే విధంగా ఈ స్టేడియాన్ని సిద్ధం చేస్తాం.ప్రస్తుతం ఈ స్టేడియంలో చాలా లోపాలు ఉన్నాయి.. అపెక్స్ బాడీ ఏర్పడిన తర్వాత వీలైనంత త్వరగా ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తాము.ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా క్రికెటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమణమూర్తి గారు, సెక్రటరీ రమేష్ గారు, మంగళగిరి సెంట్రల్ జోన్ అకాడమీ చైర్మన్ పురుషోత్తం గారు, స్టేడియం మేనేజర్ భాస్కర్ గారు, క్రికెట్ ఉమెన్స్ వింగ్ మేనేజర్ బాపూజీ గారు తదితరులు పాల్గొన్నారు...