ఛత్తీస్ గఢ్‌కి చెందిన నలుగురు పాత్రికేయులను గంజాయి కేసులో అరెస్టు చేయడం వెనుక బీజేపీ కుట్ర ఉందని ఛత్తీస్‌గఢ్ మాజీ మ ంత్రి మోహన్ మార్తవన్, మరో మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మె ల్యే కవాసి లఖ్మ ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రాజ మహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న నలు గురు పాత్రికేయులను ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మార్తవ న్, లఖ్మ, సిట్టింగ్ ఎమ్మెల్యే విక్రమ్ మాండవి, మాజీ ఎమ్మెల్యే రేఖ్‌చంద్ జైన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్వరి భాగేల్, జడ్పీ చైర్మన్ హరీశ్‌కవాసి ములాఖత్‌పై సోమవారం కలిశా రు. అనంతరం జైలు బయట వారు మాట్లాడుతూ.. ఛత్తీస్‌గ ఢ్- ఆంధ్రా సరిహద్దులో అక్రమంగా ఇసుక తవ్వుతు న్న కాంట్రాక్టర్లను ఆ నలుగురు విలేకరులు వెళ్లి ప్రశ్నించా రన్నా రు. వాళ్లకి ఆ కాంట్రాక్టర్లు మంచి మాటలు చెప్పి భోజనానికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ముందుగా వేసిన ప్లాన్ ప్రకారం భోజనం చేస్తుండగా వారి కారులో దొంగ తనంగా గంజా యిని ఉంచారని చెప్పారు. ఈ విషయం తెలియని విలేకరులు ఆ కారులో ఆంధ్రాలో ప్రవేశించగానే పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు. ఈనెల 11న సీజీ 18 ఎల్ 0698 నంబరు కలి గిన కారును చింతూరు పోలీసులు వాహన తనిఖీల్లో భాగం గా సోదా చేశారు. కారులో 3 ప్యాకె ట్లలో 15కి లోల గంజా యి ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కారులో ఉన్న దంతెవాడజిల్లా దక్షిణ బస్తర్‌కి చెందిన బప్పి రే(ఏ3), అదే జిల్లాలోని రాంపూర్ క్యాంప్‌కి చెందిన శివేందు త్రివేది(ఏ4), సుకుమా జిల్లా నకపర వార్డుకు చెందిన ధర్మేంద్రసింగ్(ఏ5), అదే జిల్లా కుంటకు చెందిన మనీష్‌సింగ్ అనే విలేకరులను అరెస్టు చేశారన్నారు. క్రైం నెం.62/2024 అండర్ సెక్షన్ 8(సీ) రెడ్ విత్ (బీ)(2) (బీ) ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. కోర్టు ఆదే శాలతో నిందితులను సెంట్రల్ జైలుకు తరలించినట్టు పేర్కొన్నారు. విలేకరులను కేసులో ఇరికించ డానికి కారులో గంజాయిని ఉంచారని అక్కడి సీసీ కెమెరాల ద్వారా స్పష్టమైనట్లు తెలుస్తోందన్నారు. కారులో గంజా యి పెట్టారని భావిస్తున్న కుంటకు చెందిన ఇర్షాద్, పవన్ లను కేసు నమోదులో ఏ1, ఏ2లుగా పేర్కొన్నారన్నారు. వీళ్ల కోసం గాలిస్తున్నారు. సీసీ ఫుటేజీలను మాయం చేసిన ఛత్తీస్‌గఢ్ ఎస్‌ఐని అక్కడి పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుమారు 20 మందితో కూడిన కాంగ్రెస్ బృందం జైలుకు వచ్చి విలేకరులకు భరోసా ఇవ్వడం ప్రాధాన్యం సంతరించు కొంది. వారికి బెయిల్ విషయంలో సహాయం చేస్తామన్నారు. అధికార బీజేపీ ప్రభుత్వపాత్ర ఉందని ఆరోపించారు.