ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బుధవారం బంద్ నిర్వహిస్తున్నట్టు దళిత మహాసభ సభ్యులు తెలిపారు. ఈ మేరకు సహకరించాలని కొత్తూరు సీఐ ప్రసాదరావుకు సోమవారం వినతిపత్రం అందిం చారు. ఎస్సీ వర్గీకరణను తక్షణం నిలుపుదల చేయాలని కోరారు. కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో కొత్తూరు మండల ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు టొంపల తిరుపతి, కార్యదర్శి పడాల నాగభూషణం, కోశాధి కారి రామ కృష్ణ, ఉపాధ్యక్షులు కృష్ణ, వడమ శ్రీను, బాలకృష్ణ తదితరులున్నారు.