ఆమదాలవలస పాటు రెండు తెలుగు రాష్ట్రల్లోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన నలుగురు దొం గలను అరెస్టు చేసినట్లు సీఐ గొంప వాయునందన్ దివాకర్ యాదవ్ తెలిపారు. సోమవా రం స్థానిక పోలీస్ సర్కిల్ కా ర్యాలయంలో విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని పార్వతీశునిపేట జంక్షన్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా మూడు బైక్‌లపై నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో పట్టుకున్నట్లు తెలిపారు. వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించగా బైక్‌లు దొంగలించి ఒడిశాలో విక్రయిస్తున్నట్లు చెప్పారు. వారి నుంచి తొమ్మిది ద్విచ క్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు. ఆమదాలవలస పట్టణా నికి చెందిన నలుగురు నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారని, కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు చెప్పారు. సమావేశంలో ఎస్ఐ వెంకటేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.