నూతన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని శ్రీకాకుళం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పోలీసు సిబ్బందికి సూచించారు. తండ్యేంవలస గ్రామంలోని పోలీసు శిక్షణ కేంద్రాన్ని ఆయన సోమవారం సందర్శించారు. ఈ కేంద్రంలోని సిబ్బంది వివరాలు, వారి విధి విధానాలపై ఆరా తీశారు. తరగతి గదులు, బారెక్స్, మైదానం పరిశీలించి వాటిని శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. నూతన చట్టాలు, ఇతరత్రా అంశాలపై శిక్షణ పొందుతున్న పోలీసు సిబ్బందితో మాట్లాడారు. ప్రస్తుత సామాజిక పరిస్థితులు, ప్రజలతో ఎలా ప్రవర్తించాలి, నీతి, నైతికత, శిక్షణలో నేర్చు కున్న చట్టాలు, వీటి అమలులో ఎదుర్కొంటున్న సమస్యలు, సైబర్ భద్రత తదితర అంశాలను ఎస్పీ వివరించారు. ఆయన వెంట ఎస్‌ఐ ఖాదర్ భాషా ఉన్నారు.