తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వ వద్దని విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. సోమవారం పద్మావతి నగర్‌లోని ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలో చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో పట్టుబడ్డ మైనర్లు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చ రించారు. ఏటా సుమారు 2 లక్షల 50 వేల మంది రహదారి ప్రమాదాల్లో మరణి స్తున్నారని, మరో 4 లక్షల మంది క్షతగాత్రులు అవుతున్నారని తెలిపారు. రహ దారి భద్రతలో భాగంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి ప్రమాదాలను ని యంత్రించడమే లక్ష్యమన్నారు. డీఎస్పీ గోవిందరావు, సీఐ సూరినాయుడు, ఎస్‌ఐ లు లోవరాజు, రవి, మహేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు.