ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెలకు వంద కడితే 3వేల పెన్షన్

national |  Suryaa Desk  | Published : Fri, Feb 01, 2019, 03:52 PM

న్యూఢిల్లీ: నెలకు వంద రూపాయలు కడితే అరవై ఏళ్ళ తర్వాత మూడువేల పెన్షన్ అందనుంది. ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్‌ ఓట్‌ ఆన్‌ అకౌంట్‌లో అసంఘటిత రంగ కార్మికులకు ఈ కొత్త పింఛన్‌ పథకాన్ని ప్రకటించారు. ప్రధాన మంత్రి శ్రమయోగి మాంధన్‌ పేరుతో ఈ పథకంలో 60ఏళ్లు నిండిన వారందరికీ ప్రతి నెలా 3వేలు పింఛన్‌ వచ్చే విధంగా రూపొందించారు. నెలసరి ఆదాయం 15వేల లోపు ఉండే వారు 29 ఏళ్ల వయస్సులో ఈ పథకంలో చేరితే 60 ఏళ్లు వచ్చే వరకూ వారు నెలకు 100 కట్టాల్సి ఉంటుంది. 18 ఏళ్లకే చేరితే నెలకు 55 చెల్లిస్తే 60ఏళ్ల తర్వాత 3వేల పింఛన్‌ అందుతుంది. అసంఘటిత రంగంలోని 10కోట్ల కార్మికులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa